TPT: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన ప్రజా ఉద్యమం చేపడుతున్నట్లు వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్ను గురువారం ఆయన ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.