కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాలలో గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. పురుషులు, మహిళల సీనియర్ విభాగంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సుమారు 328 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పురుషులు, 20 మంది మహిళా క్రీడాకారులను ఎంపిక చేశారు.