కోనసీమ: జిల్లాలో రావులపాలెం సమీపంలో అరటి, అమలాపురం పరిసర ప్రాంతాలలో కొబ్బరి ఉత్పత్తులు తయారీపై శిక్షణ, ఉత్పత్తుల ప్రోత్సాహకం కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.