SRD: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం కంగ్టి సీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. మైనర్లకు వాహనం ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇటీవల సూర్యపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం గుర్తు చేశారు. మేజర్లు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు ఉంచుకోవాలని పేర్కొన్నారు.