VKB: మర్పల్లి మండలం రావులపల్లిలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఏపుగా పెరుగుతున్న పంట ముంపులోనే ఉండటంతో అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు ముంచెత్తడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వ్యవసాయ అధికారులు వెంటనే పొలాలను సందర్శించి, నష్టాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు.