ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని గోకులం గ్రామంలో శుక్రవారం పెంకుటిల్లు గోడ కూలింది. గ్రామానికి చెందిన నాగిరెడ్డికి చెందిన ఇల్లు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి కూలినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.