SDPT: జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు గతంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 93 మద్యం దుకాణాలకు గత సంవత్సరం 4166 వేల దరఖాస్తులు రాగ 2025-2027 సంవత్సరానికి గాను 2782 దరఖాస్తులు వచ్చాయని ప్రోహిబిషన్, ఎక్సైజ్ సుపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. గతంలో డిపాజిట్ రూ.2 లక్షలు కాగా ఈ సారి అది రూ.3 లక్షలకు పెంచడం గమనార్హం.