MBNR: బాలానగర్ మండలంలోని బోడజానంపేట గ్రామ రెవెన్యూ శివారులోని తమ పొలాన్ని ఓ కంపెనీ ఆక్రమించిందని రైతులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి విన్నవించారు. సర్వే నంబర్ 87లోని 3.14 గుంటల భూమిని కంపెనీ ఆక్రమించి, ఇబ్బందులకు గురిచేస్తోందని బాధిత రైతులు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.