HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా కార్మిక నగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాలను వివరించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.