నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో పాత నేరస్థుడు రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ను రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసిఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.