ASR: నకిలీ గిరిజన కుల ధ్రువీకరణ పత్రాల కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆదివాసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ రామారావుదొర కోరారు. తామరాపల్లికి చెందిన మజ్జి కృష్ణారావు కుటుంబ సభ్యులు నకిలీ కుల ధ్రువ పత్రాలను పొందినట్లు అందిన ఫిర్యాదుపై గురువారం ఆర్ఐ రామజోగారావు, వీఆర్వో నూకరత్నంతో కలిసి విచారించారు. మైదాన ప్రాంతానికి చెందిన కృష్ణారావు ఎస్సీ కులానికి చెందిన వారన్నారు.