ASR: జిల్లాలో 64 పీహెచ్సీల పరిధిలోని 297ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో కృష్ణమూర్తి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను ఆదేశించారు. ఆయుష్మాన్ కేంద్రాల్లో 12 రకాల వైద్య సేవలు బలోపేతం చేసేందుకు ప్రొఫెసర్ డా.కుసుమ ఆధ్వర్యంలో గురువారం పాడేరులో శిక్షణ నిర్వహించారు. స్క్రీనింగ్ పరీక్షలు, ప్రాధమిక వైద్యం అందించాలని తెలిపారు.