ప్రకాశం: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మునిసిపల్ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్ కమీషనర్ కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. ఇవాళ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కమీషనర్ మాట్లాడుతూ.. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.