NLG: గుడిపల్లి మండలంలో ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు గుడిపల్లిలో జనహిత మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తారు. 11 గంటలకు చిల్కమర్రి స్టేజి వద్ద గల శివ గణేష్ కాటన్ మిల్లు వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.