MDK: తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గంగాల మెదక్ జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్, ఏఎంఓ సుదర్శన్ మూర్తి పాల్గొన్నారు.