CTR: నగరి పట్టణంలో 31 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఇందులో భాగంగా రూ.8 లక్షల విలువ గల ఈ బియ్యం ఓ గోడౌన్లో దాచి ఉంచగా పోలీసులు దాడులు నిర్వహించారు. బియ్యంతో పాటు ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు లారీలు, మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. నగరి డీఎస్పీ అహ్మద్ అజీజ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.