ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని శిశిధర్ ఖానాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో డా.ఆశా కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శేషరావు, ఆకాంక్ష, సత్యవతి, భగవాన్, శైలజ, తదితరులు ఉన్నారు.