VSP: విశాఖ జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడంపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.