NRPT: మద్దూరు మండలం జాదరావుపల్లి తాండకు చెందిన మాజీ సైనికుడు ఆంజనేయులు (42) గుండెపోటుతో మృతి చెందారు. 2014లో మణిపూర్‌లో జరిగిన ఐఈడీ బ్లాస్టింగ్‌లో కుడికాలు కోల్పోయి, చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం తాండలో ప్రభుత్వ లాంఛనాలతో ఆంజనేయులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భార్య మేఘమాల ఈ విషయం తెలిపారు.