MNCL: భీమారం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులు నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే దశల వారీగా బిల్లులు మంజూరు చేస్తామన్నారు.