విశాఖలో గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ దోపిడీ చేస్తున్న జగన్‌పై VMRDA ఛైర్మన్ ఎం.వీ. ప్రణవ్ గోపాల్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ బేస్, MOU చంద్రబాబు కాలంలోనే పూర్తయిందని, వైసీపీ పాలనలో ఐదేళ్లుగా నిలిచిపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే గూగుల్ మళ్లీ తెరపైకి వచ్చిందని, విశాఖను గ్లోబల్ డేటా హబ్‌గా తీర్చిదిద్దడం తమ విజన్ అని పేర్కొన్నారు.