TG: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ రాశారు. మార్క్ ఫెడ్ ద్వారా జరుగుతున్న మొక్కజొన్న కొనుగోళ్లలో 18 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేయాలని కోరారు. జగిత్యాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఎకరాకు 18 క్వింటాళ్లు మాత్రమే కొంటున్నారని రైతులు జీవన్ రెడ్డి దృష్టికి తెచ్చారు.