PDPL: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ అంబర్ కిషోర్ హాజరై డీసీపీ పీ. కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు, యువత రక్తదానం చేశారు.