BPT: బాపట్లలోని ప్రధాన రహదారులపై గోవుల సంచారం పెరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.యాజమానుల నిర్లక్ష్యం కారణంగా గోవులు రోడ్లపైనే నివాసాలుగా ఉంటున్నాయి. రహదారులపై గోవుల వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి కొందరు మరణించారని స్థానికులు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఈ ప్రమాదకర సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.