కృష్ణా: మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై సుల్తాన్ నగరం ఫ్లైఓవర్ వద్ద ఎస్సై నున్న రాజు శుక్రవారం ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి వారికి ISI మార్క్ కలిగిన హెల్మెట్లను కొనుగోలు చేయించి, హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు పంపించారు.