PPM: జిల్లాలోని జల వనరులు మరియు చెరువులు ఆక్రమణ కాకుండా పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చెరువులు, జలవనరులపై జేసీ సమీక్షించారు. ఈ సందర్బంగా గత సమావేశంలో తీసుకొన్న చర్యల నివేదికను జేసీ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నీటి కుంటలను వెంటనే గుర్తించాలన్నారు.