నమ్మదగిన సమాచారం మేరకు న్యాల్కల్ మండలం, రాజుల గ్రామంలోని జర్నప్ప వ్యవసాయ క్షేత్రంలో చెరుకు తోటలో పేకాట ఆడుతున్న 11 మందిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సుజిత్ తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన 11 మంది వ్యక్తులు జూదం ఆడుతుండగా వారి వద్ద నుంచి రూ:1,80,000 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.