AP: కృష్ణా జిల్లాలోని NIDM ప్రాంగణానికి DyCM పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అక్కడ జరిగిన అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీతో కలిసి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాల సన్నద్ధతపై చర్చించారు. అనంతరం పలు అంశాలపై అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.