ELR: నిడమర్రు మండలం భువనపల్లి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల 28న ఉంగుటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.