TG: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాధాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసింది. ఘటన జరిగినప్పటి నుంచి యాజమాన్యం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.