AP: దుబాయ్లో మూడోరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం 6:30 గంటలకు తెలుగు ప్రజలతో APNRT నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు యూఏఈలోని తెలుగు ప్రజలు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేసుకుని చంద్రబాబు పాల్గొనే సమావేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.