GDWL: రాజోలి మండలం సుంకేసుల బ్యారేజీ నుంచి రైతుల అవసరాల మేరకు సాగునీరు విడుదల చేయాలని ఏపీ కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గురువారం రాజోలి సమీపంలోని బ్యారేజీని ఆమె సందర్శించారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, గేట్లు ఓపెన్ చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద వచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.