NZB: ఆరోగ్యవంతమైన రాష్ట్ర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం గుండారంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.