VZM: విజయవాడ ఇంద్ర కీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.ఆమె మాట్లాడుతూ.. భక్తులకు దర్శనం జరిగేలా ఏర్పాట్లు సౌకర్యవంతంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పల రాంప్రసాద్ ఉన్నారు.