మహబూబ్ నగర్: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఇవాళ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కురుమూర్తి దేవస్థాన ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.