KDP: శుక్రవారం వల్లూరు మండలంలో కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రభుత్వ కార్యాలయాలను ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పరిశీలించారు. ప్రాథమిక ఆసుపత్రి, మండల విద్యాశాఖ, వెలుగు కార్యాలయం, ఉపాధి కార్యాలయం వంటివి వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నాయని తెలుసుకున్న ఆయన, ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి DMF నిధుల ద్వారా త్వరగా మరమ్మతులు చేయిస్తామన్నారు.