అన్నమయ్య: పుల్లంపేట మండల తపాలా శాఖ గ్రామీణ డాక్ కార్యాలయంలో, గ్రామీణ డాక్ సేవకుల సహకారంతో పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు 22 రకాల నిత్యవసర సరుకుల పంపిణీ జరిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను అర్థం చేసుకుని సేవాభావంతో ముందుకు వస్తున్న గ్రామీణ డాక్ సేవకుల దాతృత్వం ప్రశంసనీయం అని సంఘ అధ్యక్షుడు పేర్కొన్నారు.