కృష్ణా: అవనిగడ్డ గ్రామం కొత్తపేట జనసైనికులు శుక్రవారం శ్రమదానం చేశారు. గ్రామంలో కురిసిన భారీ వర్షానికి అంతర్గత రహదారులపై నీరు నిలిచిపోయి రాకపోకలకు అసౌకర్యం ఏర్పడింది. దీంతో కొత్తపేట ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, గ్రామ జనసైనికులు కలిసి జేసీబీతో కచ్చా డ్రైనేజీని పూడిక తీయించారు. అయినా వర్షపు నీరు తొలగక పోవటంతో డ్రైనేజీలో దిగి అడ్డంకులు తొలగించారు.