ప్రకాశం: తుఫాన్ కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుందని వర్షాలు తగ్గేంత వరకు భైరవకోనకి ఎవరు రావద్దని ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డివో భైరవకోనను సందర్శించారు. అనంతరం అమ్మవరం కొత్తపల్లి నుండి భైరవకోనకు వెళ్లే దారిలో వాగులు వంకలు పొర్లి పొంగుతున్నాయన్నారు.