కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘కాంతార ఛాప్టర్-1’. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తెలుగు వెర్షన్లో ఈ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో డబ్బింగ్ మూవీగా ఇది రికార్డుకెక్కినట్లు సినీ వర్గాలు తెలిపాయి.