కృష్ణా: కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన బాధాకరం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బస్సు తగులబడి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకర ఘటన అన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు భగవంతుడు శాంతిని కలిగించాలన్నారు. వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియచేశారు.