PLD: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై తెస్తున్న పీపీపీ (Public-Private Partnership) విధానంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని గురువారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విమర్శించారు. ఐదేళ్లలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడంలో విఫలమైన వైసీపీ, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.