కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయి విఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3 టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2 కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్‌పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు.