MLG: జిల్లా కేంద్రంలోని మేడారం మహా జాతర పనుల పర్యవేక్షణ కోసం రాష్ట్ర మంత్రుల బృందం శుక్రవారం పర్యటించనుంది. ఇటీవల దేవాదాయ మంత్రి కొండా సురేఖ గైర్హాజరవ్వడం వివాదాస్పదమైంది. మీనాక్షి నటరాజ్ చొరవతో వివాదం సద్దుమనిగింది. రేపటి పర్యటనలో సురేఖ కూడా ఉంటారని సమాచారం. ఈ క్రమంలో కలెక్టర్ దివాకర్ ఇవాళ మేడారం సందర్శించి, వన దేవతల గద్దెల పనులను పరిశీలించారు.