KMM: తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను పసుపు బోర్డు సెక్రటరీ భవాని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమ వివరాలను మంత్రికి వివరించారు. అనంతరం ఆయిల్ ఫామ్లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించవలసిందిగా మంత్రి సూచించారు.