NGKL: జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ఈ నెల 25న ముత్తూట్ మనీ లిమిటెడ్ కంపెనీకి చెందిన 50 ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జూనియర్ ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ సింగ్ గురువారం తెలిపారు. ఇంటర్, డిగ్రీ లేదా ఆపై చదివి, 25 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.