మహిళల వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఓపెనర్లు స్మృతి మంధాన(109), ప్రతీక రావల్(122) సెంచరీలు నమోదు చేయగా, జెమిమా(69) అర్థ సెంచరీతో రాణించింది. ప్రస్తుతం వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 48 ఓవర్లలో 329/2 పరుగుల భారీ స్కోరు చేసింది. NZ బౌలర్లలో కెర్, బెట్స్ చెరో వికెట్ తీశారు.