KMR: నా కుటుంబం నా వ్యక్తిగత స్వార్థం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టణంలో గురువారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.