ATP: నగరంలోని పోలీస్ రక్షక్ ప్రైమరీ స్కూలు విద్యార్థులకు డిస్కవర్ అనంతపురం, ఏజీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ స్లేట్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్, హ్యాండ్ వాష్ కిట్స్ వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ పి.జగదీష్ సమక్షంలో జరిగింది. వితరణ చేసిన అనిల్ కుమార్, ఏజీ ప్రమీలమ్మలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.