GDWL: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ సమావేశాలకు జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి సునీత జిల్లా సమావేశంలో గురువారం హాజరయ్యారు. ఈ సమావేశంలో ఈ నెల 26, 27 తేదీలలో మహబూబ్నగర్లో జరగనున్న ఆశా వర్కర్స్ రాష్ట్ర మహాసభలు, కాంగ్రెస్ పార్టీ ఆశాలకు ఇచ్చిన హామీలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాల గురించి చర్చించినట్లు ఆమె తెలిపారు.